![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-420 లో.. విశ్వని, చందు, ధీరజ్, సాగర్ కలిసి కొడుతుంటారు. అయినా సరే నేను ఇలాగే వేరే అమ్మాయితో తిరుగుతానని విశ్వ అంటాడు. దాంతో ధీరజ్ అక్కడ దగ్గర్లో ఉన్న ఒక పెద్ద రాయిని తీసుకొని విశ్వ మీదకి వెళ్తాడు. ఎవరేం చెప్పినా వినిపించుకోడు. వాడు అసలు నా మెడలో తాళి కట్టలేదని అమూల్య అంటుంది. దాంతో అందరు షాక్ అవుతారు.
అసలు ఏంటమ్మ వాడు నీ మెడలో తాళి కట్టకపోతే అది నీ మెడలోకి ఎలా వచ్చిందని అడుగగా అమూల్య సైలైంట్ గా ఉంటుంది. అసలు ఏం జరిగిందని అడిగినా తను ఏం చెప్పకపోయేసరికి రెండు కుటుంబాల మధ్య తీవ్రంగా గొడవ జరుగుతుంది. అమూల్యని మెడలో తాళి వేసుకోమని చెప్పింది నేనే అని ప్రేమ చెప్పగానే అందరు షాక్ అవుతారు. వాడు నీ మెడలో తాళి కట్టలేదు కదా అని అమూల్య దగ్గరికి రామరాజు వెళ్ళి అడుగుతాడు. లేదని తను అంటుంది. అయితే అది తీసి వాడి ముఖం మీద కొట్డు అని వేదవతి, రామారాజు అనగానే అనూల్య తాళి తీసి వాడి ముఖం మీద పడేస్తుంది. ఆ తర్వాత విశ్వ ఫ్యామిలీ, అమూల్య ఫ్యామిలీ ఎవరి ఇంట్లోకి వాళ్ళు వస్తారు. ఇక తాళి మెడలో వేసుకోమని చెప్పిన ప్రేమని ధీరజ్ అసహ్యంగా చూస్తాడు.
ఇక అమూల్యని అందరు నిలదీస్తారు. అసలు వాడు తాళి కట్టకుండా నువ్వు మెడలో ఎందుకు వేసుకున్నావ్.. పెళ్ళి ముందు రోజు రాత్రి వాడిని నమ్మి వాడితో నువ్వు వెళ్ళకుంటే ఇదంతా జరిగేది కాదని చందు అంటాడు. అసలు ఆ రోజు రాత్రి ఎందుకు వెళ్ళావ్.. ఎవరైనా వెళ్ళమన్నారా అని సాగర్ అంటాడు. వాళ్ళు అడుగుతున్నారు కదా చెప్పు అమూల్య అని ధీరజ్ అంటాడు. దాంతో అమూల్య జరిగింది గుర్తుచేసుకుంటుంది. వాడు నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి నా క్యారెక్టర్ మీద మచ్చ వేస్తానని బెదిరించాడు., మీ మీద పగతో ఇలా నన్ను ప్రేమించినట్టు యాక్ట్ చేశాడని అమూల్య అందరికి చెప్తుంది. నిన్ను బయటకు రప్పించేలా చేసి విశ్వ తీసుకెళ్ళాలా చేసి, నీ మెడలో తాళి వేసుకోమని చెప్పింది ప్రేమనే కదా అని ధీరజ్ అమగానే లేదు అన్నయ్య నువ్వు ప్రేమ వదినని తప్పుగా అర్థం చేసుకుంటున్నావని అమూల్య అంటుంది. అలా చేసింది ఎవరంటే అని శ్రీవల్లి వైపు చూస్తుంది అమూల్య. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |